Search This Blog


Wednesday, December 15, 2010

ఒక పిట్ట కధ


మీకు ఒక పిట్ట కధ చెప్పాలనుకుంటున్నాను. పిట్ట కధంటే ఏదో చిన్న కధ అనుకున్నారు.నిజంగా పిట్ట కధేనండీ.ఆరు మాసాల క్రితం నాకు ట్రాన్స్‌ఫర్ అయ్యింది.ఎక్కడికి అనుకున్నారు? ఒరిస్సా లోని ఒకానొక పర్యాటక ప్రాంతానికి. ఈ ప్రాంతానికి రకరకాల పిట్టలు/పక్షులు వలస వస్తాయి.నాకు ఎలాట్ చేసిన క్వార్టర్‌కి చుట్టూ చెట్లు ఉన్నాయి,ప్రత్యేకంగా ఎదురుగా ఒక పెద్ద రావి చెట్టు ఉంది.దాని మీదికి అప్పుడప్పుడూ కొన్ని పక్షులు వస్తుంటాయి.అందులో కొన్ని చాలా అందంగా రంగు రంగులలో ఉంటాయి.
మా పెద్ద అమ్మాయికి వాటిని ఏ డిస్కవరీ చానెల్ లేదా నేషనల్ జాగ్రఫీ చానెల్ లెవెల్లో ఫొటోలు తీద్దామని ఆశ. మా ఇంట్లో మంచి కెమెరాయే ఉంది. 14 మెగా పిక్సెల్,3X జూమ్ డిజిటల్ కేమెరా.చాలా సార్లు ప్రయత్నం చేసింది.అయితే ఈ పిట్టలేమయినా మనకు కావల్సినట్టు ఫోజులిస్తాయా ఏంటి.ఆకుల్లో దాక్కుంటాయి.ఈ కొమ్మనుంచి ఆ కొమ్మకి ఎగురుతుంటాయి.ఇంక మనల్ని కానీ గమనించాయా పరారయిపోతాయి.ఒక్క ఫొటో అయినా తిన్నగా రాలేదు. అప్పుడు కానీ అర్ధం కాలేదు,బర్డ్‌వాచర్స్ ఒక్కోఫొటో తియ్యటానికి ఎంతగా కష్టపడతారో,అరుదైన పక్షులఫొటోలు తియ్యటానికైతే ఎన్నిరోజులు ఎదురు చూస్తారో.పక్షులలో ఉన్నన్ని రంగులు మరే ప్రాణులలో లేవేమో? అందమైన పక్షులను చూద్దామనుకుంటున్నారా. ఈ కోల్కతాబర్డ్స్ వెబ్సైట్ కు వెళ్ళండి.భారత దేశంలో 1250 రకాల పక్షి జాతులున్నాయని,ఇవి మొత్తం ప్రపంచ పక్షి జాతులలో దాదాపు 13 శాతం అని తెలిసి ఆశ్చర్యం,ఆనందం కలిగాయి. మీరూ ఆనందించండి. ఈ లోపల మా అమ్మాయి ఏదైనాఫొటో తీస్తే మీకు చూపిస్తాను.

2 comments:

  1. మీ బ్లాగు బాగుంది. మరి నా బ్లాగూ చూస్తారా!!
    www.iandsahachara.blogspot.com

    ReplyDelete
  2. @SKY
    మీ బ్లాగు బాగుంది.ఇప్పుడే చూసాను.
    @నాగరాజు గోల్కొండ
    నా వ్యాఖ్య లో తప్పేముందో నాకు అర్ధం కాలేదు. మీ మనసేమైనా గాయపడితే క్షమించండి. I wish all the best to you and your మొగిలిపేట.

    ReplyDelete