గాంధీ అనబడే ఒక బక్కపలచని వ్యక్తి ,ప్రపంచాన్ని తన ఆధీనం లో ఉంచుకున్న బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడ గడ లాడించి తన దారికి తెచ్చుకున్నాడంటే ఎప్పటికీ ఆచ్చర్యం గానే ఉంటుంది. కళ్ళజోడు, చేతికర్ర, కొల్లాయి గుడ్డ ఇదీ ఆయన ఆహార్యం.వేరు సెనగలు,మేకపాలు లాంటి వే ఆయన ఆహారం.సత్యం,శాంతి,సహనం,ప్రేమ ఇవే ఆయన ఆయుధాలు. ఇవే భారతీయ జీవన విధానపు మూల స్థంభాలు.స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన చూపిన తెగువ,విభిన్న వర్గాలను ఏకం చేయటంలో ఆయన చూపిన చాతుర్యం అందరికీ ఆదర్శ ప్రాయం.
హీరో అంటే కండలు తిరిగి ఉండనవసరం లేదు, చిత్రమైన దుస్తులు వేయనవసరం లేదు,విచిత్రమైన విన్యాసాలు చేయనవసరం లేదు. మానసిక ధృడత్వం,ధైర్యం,అందరికీ ఆదర్శప్రాయమైన జీవనశైలి,మచ్చలేని గుణం,ఉన్నతమైన ఆశయాలు ఇవీ నిజమైన హీరోకి ఉండవలసిన లక్షణాలు.ఇవి అన్నీ ఉన్నాయి కాబట్టే ఆయన నిజమైన హీరో.అయితే మనం ప్రస్తుతం ఏంచేస్తున్నాం.హంగు,ఆర్భాటాలు,పాచ్చాత్య జీవన శైలి,మత్తులో మునిగితేలుతున్న ప్రజలు,మద్యం అమ్మకాలమీద వచ్చే ఆదాయం పై ఆధారపడుతున్న ప్రభుత్వాలు.ఇదేనా మనం స్వాతంత్ర్య యోధులకు ఇచ్చే నివాళి.
ఆ మహాత్ముడి పుట్టిన రోజున,మనం పునరాలోచించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.మనం వెళుతున్న దారి సరైనదా కాదా అన్నది మనకే తెలిసిపోతుంది.
ఆ మహాత్ముడి పుట్టిన రోజున,మనం పునరాలోచించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.మనం వెళుతున్న దారి సరైనదా కాదా అన్నది మనకే తెలిసిపోతుంది.
విలువలు ఎప్పటికీ శాశ్వతమైనవి.వాటిని ఈ గాంధీ జయంతి సంధర్భం గా గుర్తుకు తెచ్చుకుందాం,ఆచరించటానికి ప్రయత్నిద్దాం.
Jai Gandhiji.. He is a realy hero of the centuary
ReplyDelete