ఇంకా కోడి ముందా, గుడ్డుముందా....
చెట్టు ముందా,విత్తు ముందా....
అన్న ప్రశ్నలకు సమాధానాలు దొరకనే లేదు.
మరి ఈ అయుధాలు మీరెప్పుడు చేపడుతున్నారు్?
సిధ్ధమా మరి?
చెట్టు ముందా,విత్తు ముందా....
అన్న ప్రశ్నలకు సమాధానాలు దొరకనే లేదు.
మనం ఎప్పట్నుంచో వల్లెవేస్తున్న యధారాజా తధా ప్రజా ను కాదని,ABN ఆంధ్రజ్యోతి యధాప్రజా తధారాజా అంటూ రాజు ముందా ప్రజలు ముందా అన్న కొత్త భేతాళ ప్రశ్న మన ముందుకు తెచ్చింది.రాజకీయ నాయకులు అవినీతికి అలవాటు పడిపోయారని,భూస్వాములు,పెట్టుబడి దారులకు కొమ్ముకాస్తూ,ఆశ్రితుల పట్ల ఎనలేని పక్షపాతం ప్రదర్శిస్తున్నారని ప్రజలంటే,అవినీతి అన్ని రంగాలలో ఒక అనివార్యమయిన విషయంగా మారిపోయిందని,కోట్ల రూపాయలు ఖర్చుపెడితేకాని ఎన్నికలలో నెగ్గే పరిస్థితి లేదని కొందరు నాయకులు వాపోతున్నారు.ఇది ఒక విషవలయంగా మారిపోయిందని మాత్రం స్పష్టంగా తేలిపోయింది.
మరి దీనికి అంతం ఎక్కడ?అంతిమంగా నష్టపోయేది సామాన్యుడేనన్నది మరింత స్పష్టం.
అయితే ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఒకటుంది,ప్రజలంతా విద్యావంతులు,విజ్జతతో అలోచించేవారు,స్వల్పకాలిక ప్రయోజనాల కు,ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటును వినియోగించేవారు అయినప్పుడు రాజకీయ నాయకులు ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా నడవక తప్పదు.నాయకులు దూరదృష్టి కలవారు,సమర్ధులు, నిజాయితీపరులు,అభివృధ్ధికి దోహదమయ్యే చట్టాలు చెయ్యకలిగినవారు అయినప్పుడు ప్రజలే వారిని అనుసరిస్తారు.
నేడు ప్రజలేమీ అసహాయులు కాదు.సమాచారహక్కు చట్టం,విద్యాహక్కు చట్టం,ఉపాధిహామీ చట్టం లాంటి అద్భుతమైన ఆయుధాలు వీరికి అందుబాటులో ఉన్నాయి. ప్రయోగించటమే మిగిలింది.కనీసం కొంతశాతం ప్రజలు వీటిని అందిపుచ్చుకున్నా ఊహకందని ఫలితాలుంటాయి.అవినీతిని వెలికితీసి బద్దలు చేయటానికి, అమాయకులైన బాలలను,యువతను భాద్యత,నిజాయితీకల పౌరులుగాతీర్చి దిద్దటానికి ఉపయోగపడతాయి.
అంతేకానీ పరస్పర నిందలవల్ల ప్రయోజనం లేదు.నేడు ప్రజలేమీ అసహాయులు కాదు.సమాచారహక్కు చట్టం,విద్యాహక్కు చట్టం,ఉపాధిహామీ చట్టం లాంటి అద్భుతమైన ఆయుధాలు వీరికి అందుబాటులో ఉన్నాయి. ప్రయోగించటమే మిగిలింది.కనీసం కొంతశాతం ప్రజలు వీటిని అందిపుచ్చుకున్నా ఊహకందని ఫలితాలుంటాయి.అవినీతిని వెలికితీసి బద్దలు చేయటానికి, అమాయకులైన బాలలను,యువతను భాద్యత,నిజాయితీకల పౌరులుగాతీర్చి దిద్దటానికి ఉపయోగపడతాయి.
మరి ఈ అయుధాలు మీరెప్పుడు చేపడుతున్నారు్?
సిధ్ధమా మరి?