భారత రాజ్యాంగం మనకు ప్రాధమిక హక్కులు ప్రసాదించిందని,ప్రాధమిక హక్కులు భారత రాజ్యాంగానికి మూల స్తంభాల లాంటివని మీ అందరికీ తెలుసు.అయితే అవి ఏ విధంగా సమర్ధంగా అమలు చేయబడతాయి?
కంచే చేనుమేసినట్లు ప్రభుత్వం,ప్రభుత్వ అధికారులే ప్రాధమిక హక్కులు ఉల్లంఘిస్తే ఏం చేయాలి?
కంచే చేనుమేసినట్లు ప్రభుత్వం,ప్రభుత్వ అధికారులే ప్రాధమిక హక్కులు ఉల్లంఘిస్తే ఏం చేయాలి?
ఇలాంటి సందర్భాలలో పౌరులు ఆర్టికల్ 32 లేదా ఆర్టికల్ 226 క్రింద సుప్రీంకోర్టు లేదా హైకోర్టును ఆశ్రయించవచ్చు. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు ఈ క్రింది రిట్లను జారీ చేయటం ద్వారా ప్రాధమిక హక్కులను కాపాడతాయి.
వీటినే రాజ్యాంగ తరుణోపాయాలు అంటారు.
వీటినే రాజ్యాంగ తరుణోపాయాలు అంటారు.
- హెబియస్ కార్పస్: ఏ వ్యక్తి నయినా అక్రమంగా బంధించినప్పుడు,సంబంధిత అధికారి/వ్యక్తి కి స్వాధీనంలోని వ్యక్తిని తెచ్చి చూపి,కారణం తెలియపరచవలసిందిగా ఇచ్చే ఆజ్ఞ.
- మాండమస్: ఏదైనా రాజ్యంగ లేదా శాసన విధిని నిర్వర్తించమని కానీ, అమలుచేయరాదని కానీ భాద్యులైన ప్రభుత్వ అధికారులకు,క్రిందికోర్టులకు ఇచ్చే ఆజ్ఞ.
- ప్రొహిబిషన్: ఇది క్రిందికోర్టులు తమ పరిధి మీరినప్పుడు, తీర్పు వెలువరించకుండా నిషేధిస్తూ ఇచ్చే ఆజ్ఞ.
- సెర్షియరరీ: ఇది క్రిందికోర్టులు తమ పరిధి మీరి ఇచ్చిన తీర్పులను రద్దు చేస్తూ ఇచ్చే ఆజ్ఞ.
- కో వారంటో:ఎవరైనా వ్యక్తికి పబ్లిక్ పదవి పొందుటలో గల శాసనబద్దతను ప్రశ్నిస్తూ ఇచ్చే ఆజ్ఞ.
No comments:
Post a Comment