అందుబాటులో ఉన్నవాటిలోఏవైద్యవిధానంమంచిది.అల్లోపతా,ఆయుర్వేదమా,హోమియోపతియా, నేచురోపతియా, యునానియా.ఏ వైద్యం విధానం విశిష్టత దానిది.అయితే ఈ కాలంలో అల్లోపతి సర్వ జనామోదమైన వైద్యంగా భావించబడుతుంది.అయితే ఇది సమగ్రమైన వైద్యవిధానమేనా?ఈ వైద్యంలో అన్ని వ్యాధులకూ చికిత్స ఉందా అంటే ఖచ్చితం గా లేదు అని చెప్పవచ్చు.మనకు తెలిసినంత వరకు కేన్సర్,ఎయిడ్స్,వైరస్‌ల వల్ల వచ్చే వ్యాధులకు అల్లోపతివైద్యంలో సంపూర్ణచికిత్సలేదు.అంతేకాకుండా కొన్ని వ్యాధులకు ఇచ్చే మందుల వల్ల వ్యాధి నయమయినప్పటికీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా తీవ్రంగా ఉండవచ్చు.మరోపక్క హోమియో వైద్యులు తమ విధానం లో అన్ని వ్యాధులకు చికిత్స ఉందని అంటారు.ఆయుర్వేద వైద్యులు తమ విధానం లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండనే ఉండవని అంటారు.
ఈ మధ్య మాకుటుంబ సభ్యులలో ఒకరు మూత్రపిండాలలో రాళ్ళ వల్ల నొప్పితో భాధపడుతుంటే అల్లోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. ఆయన ఆ ప్రాంతంలో చాలా మంచి పేరున్న వైద్యులు,చాలా మంచివ్యక్తి.కొన్ని పరీక్షల తర్వాత 2 నుంచి 3 మి.మీ.సైజ్ రాళ్ళున్నాయని నిర్ధారించారు.కొన్ని మందులు వాడితే సరిపోతుందని అన్నారు.ఆ మందులు తీసుకుని ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే అందులో ఒకటి ఆయుర్వేద మందు.మూలికల పొడిని కేప్సూల్స్ లో నింపారు.దానిపేరు డై స్టోన్.నేను చాలా ఆశ్చర్యపోయాను.ఇది ఒక రకంగా శుభ పరిణామమే.ఇంతకు ముందు ఒక డాక్టర్ దగ్గుకు ఏదో ఆయుర్వేద మందు ప్రిస్క్రైబ్ చేసినట్లు గుర్తు.దానిపేరు హనీటస్ అనుకుంటా. ఇప్పటి వరకు నాకు తెలిసినంతవరకు వివిధ వైద్య విధానాలను ప్రాక్టీస్ చేసే డాక్టర్ ల మధ్య పరస్పర అవగాహన కానీ సమన్వయం కానీ లేవు.ఒకరి వైద్యవిధానం లో లోపాలున్నాయని ఒకరంటే అసలు వారి వైద్యం లో శాస్త్రీయతే లేదని మరొకరనేవారు.ఈ విధమైన పరస్పర ఆరోపణలు, అనవసర వాగ్యుధ్ధాల వల్ల ఎవరికీ ఉపయోగం లేదు.అయితే పైన చెప్పిన సంఘటన ఒకరి వైద్యవిధానం లోని విశిష్టతలను మరొకరు గుర్తిస్తున్నారనటానికి ఆస్కారమిస్తుంది.లేకపోతే ఇది మందుల తయారీ సంస్థల గారడీ కూడా కావచ్చు.
అయితే ఈ విషయం లో ప్రభుత్వం కూడా తనవంతు పాత్ర నిర్వహించాలి.ప్రస్తుతం ప్రభుత్వం ఈ వైద్యవిధానాలు అన్నిటినీ దేనికదే ప్రత్యేకం గా గుర్తిస్తుంది.అలాకాకుండా వివిధ వైద్యవిధానాల మధ్య సమన్వయం కోసం సంస్థలను ఏర్పాటు చేయాలి.ఒక వ్యాధికి ఏ వైద్య విధానం లో ఉత్తమమైన చికిత్స ఉందో గుర్తించాలి.అప్పుడు ఆ వ్యాధికి ఏ వైద్య విధానంలోనయినా అదే ఉత్తమ చికిత్స అందే విధంగా చర్యలు తీసుకోవాలి.అప్పుడే అన్ని వైద్య విధానాలలోని మంచిని వినియోగించుకోగలగటానికి అవకాశం ఉంటుంది.
మీకు ఇలాంటి అనుభవాలు ఏవైనా ఎదురై ఉంటే దయచేసి అందరికీ ఉపయోగపడేందుకు ఇక్కడ తెలియచేయ కలరు.
"ఒక వ్యాధికి ఏ వైద్య విధానం లో ఉత్తమమైన చికిత్స ఉందో గుర్తించాలి.అప్పుడు ఆ వ్యాధికి ఏ వైద్య విధానంలోనయినా అదే ఉత్తమ చికిత్స అందే విధంగా చర్యలు తీసుకోవాలి" - Very Well Said, Sir
ReplyDeleteThank you.
ReplyDeleteఆయుర్వేదం వైద్య పట్టాలతో ప్రాక్టీసు పెట్టి అల్లోపతి ఉపయోగించే
ReplyDeleteవైద్యులని తరుచూ చూస్తాము. టపాలోని విషయం (వి)చిత్రమే :)