Search This Blog


Sunday, February 13, 2011

మనం తెలుగు బ్లాగుల్ని ఎటు తీసుకుపోతున్నాం?

     అంతర్జాలం మనకు ఇచ్చిన ఒక అమూల్యమైన బహుమతి ఈ బ్లాగులు.తెలుగులో బ్లాగు నడపగలుగుతున్నారంటే తప్పనిసరిగా విద్యావంతులు,కాస్తో కూస్తో కంప్యూటర్ మీద పట్టు ఉన్నవాళ్ళూ,తెలుగు మీద అభిమానం, తెలుగు వారి సంస్కృతి మీద అభిమానం ఉన్న వాళ్ళూ,విజ్ఞులు  అయిఉంటారని నా అభిప్రాయం.నేను బ్లాగు మొదలెట్టి నిండా సంవత్సరం కాలేదు.అయితే ఈ కొంత కాలం లోనే కొన్ని అద్భుతమైన బ్లాగులను చూసాను,అవి చూస్తే ఆ బ్లాగర్ ల అభిలాష,విషయ పరిజ్ఞానం,విషయ సేకరణ వెనుక వాళ్ళ కృషి చెప్పకనే తెలుస్తుంది.అలాంటి మేధావుల నుంచి, అనుభవజ్ఞుల నుంచి ఎంతోనేర్చుకోవచ్చనిపిస్తుంది.అది నిజం కూడా.ఆయితే దురదృష్టవసాత్తు కొన్నిసంఘటనలవల్ల కొంతమంది బ్లాగర్ల మధ్య వివాదాలు తలెత్తినట్లు తెలుస్తుంది.ఇవి కుటుంబ సభ్యులను దూషించటం , ఆలాగే కొన్ని కోట్లమంది ఆరాధింఛే దైవాలను దూషించి, ఇతిహాసాలకు కూడా వక్రభాష్యం చెప్పే స్థాయికి చేరిపోయాయి.ఇలాంటి పోస్ట్ ల సంఖ్య క్రమేపీ పెరిగిపోతుంది.దీనివల్ల ఆ బ్లాగర్లు ఆశించినది నెరవేరుతుందోలేదో కానీ మిగిలిన బ్లాగర్ ల మనోభావాలు మాత్రం దెబ్బతిన్నాయి.వాళ్ళకు వేదన మిగిల్చుతున్నాయి.ఇదేనా భాధ్యత కలిగిన తెలుగువారినుంచి ఆశించగలిగేది. మనం మన తరవాతి తరాలకు అందించే బహుమతి ఇదా.ఇలాంటి సంఘటనలవల్ల చాట్ రూంలకి అధోగతి పట్టింది.బ్లాగులకి ఆ గతి పట్టకుండా కాపాడుకోవలసిన అవసరం ఉంది.
వాస్తవానికి ఏ యుధ్ధం లోనూ విజేత ఉండడు(దు).గెలిచినవారికి, లేదా గెలిచామనుకున్న వారికి కూడా అప్పటికే చాలా గాయాలు తగిలి ఉంటాయి.అవి నిరంతరం గుర్తుకువచ్చి వేధిస్తూనే ఉంటాయి.అందుకే యుధ్ధాన్ని నివారించటమే ఉత్తమ మార్గం,యుధ్ధం ఇప్పటికే మొదలైంది కాబట్టి తక్షణం విరమించటం మంచిది.

క్రోధాద్భవతి సమ్మోహః
సమ్మోహాత్ స్మృతి విభ్రమః! 
స్మృతి భ్రంసాద్బుద్ధినాశో
బుద్ధినాశాత్ ప్రణశ్యతి!
(ఇది మీకందరికీ తెలిసిన శ్లోకమే,మరోసారి గుర్తుచేస్తున్నానంతే) 

అనుద్వేగకరం వాక్యం 
సత్యం ప్రియహితంచయత్! 
స్వాధ్యాయభ్యసనం చైవ
వాఙ్మయం తప ఉచ్యతే!
(ఇతరుల మనస్సుకు భాధ కలిగించనిది,సత్యమైనది,ప్రియమైనది, మేలుకలిగించునది అయిన వాక్యము పలుకుట వేదములను, శాస్త్రములను, అభ్యసించుటవలె వాచిక తపస్సు అని చెప్పబడుచున్నది)

బ్లాగర్లు అందరికీ ఇదే నా విన్నపం. దయ చేసి అంతా సంయమనం పాటించండి.తెలుగు బ్లాగుల ప్రతిష్ట పెంచండి.

6 comments:

  1. EE blogs nundi aa katti mahesh ni, malak ni, nehharikani veli veste almost 95 % ee nusense taggutundhi.
    enta visugu pudutundo teliyadam ledhu.

    emaina eedesam lo okka hindu devullanu matrame titta galam.
    Dammu unna madagu ayina, chetiki gajulu todukunna adadi ayina muslimni ledha cristians ni timmanadi chuddam

    ReplyDelete
  2. sorry main peru marchi poya. praveen sharma ni kuda veli aveyalee

    ReplyDelete
  3. తెలుగు బ్లాగులు ఎటూ పోవు, జనాల మీదో, మతాల మీదో, కులాల మీదో, తమకు నచ్చని వాళ్ల మీదో ఓ పద్దితిలో బురద జల్లటం, మొదట్లో ఆ బురద జల్లించుకొన్నవారు చూసి చూసినట్లు పోవటం, అ తర్వాత వారిలో ఎవరికో ఒకరికి ఎక్కడో కాలి ఆ బురద జల్లినవాళ్లతో ఆడుకోవటం సహజం. అది ఇంగలిపీసు బ్లాగులయినా, ఇంకో భాష బ్లాగులయినా కామనే, బ్లాగులు చాట్ రూము లాంటివే కాని ఈ విషయం లో , పూర్తిగా వెరేవి కాదు కదా!!

    ఇక తెలుగు బ్లాగులలో వెరైటీ ఏమిటి అంటే, తమకు నచ్చని మనుషులను అనకుండా దేముళ్లను అనటం పిచ్చెక్కి, సందు దొరికింది కదా అని ప్రతి "సుత్తి" పత్తిత్తి కబుర్లు చెప్పటం, పిచ్చెక్కిన వాళ్లను వదిలేసి, వాళ్లకు తమకు తెలిసిన వైద్యం (వేపమండలతో) చేస్తున్నవాళ్లకు మర్యాదరామన్న కబుర్లు చెప్పేవాళ్లు ఎక్కువ అవ్వటం!!

    అసలు ఈ మర్యాదరామన్నలు పిచ్చోళ్లు పిచ్చి టపాలు వేసినప్పుడు ఏమయినారబ్బా? ఇక ఇంత టపా వేసిన ఈ బ్లాగరు అయినా ఒసే పిచ్చీ ఆ పిచ్చి టపా ఏమిటి? సీతమ్మ ఏమిటి, అద్వానీ ఏమిటి? మమైత్ ఖాన్ ఏమిటి? నువ్వు నీ పిచ్చి అని ఓ మాట అయినా అనగలిగారా? ఉన్న మాట అనలేనప్పుడు ఎన్ని సంస్కృత శ్లోకాలు ఉటంకిస్తే ఉపయోగం ఏమిటి? తెలుగు బ్లాగుల భవిత కోసం ఎన్ని కన్నీళ్లు కారిస్తే ఉపయోగమేమిటి?

    ReplyDelete
  4. వ్యక్తి విమర్శ అనవసరమనుకుంటున్నాను.
    మూడో అజ్ఞాత గారికి,
    మీరు పోస్ట్ పూర్తిగా చదవకుండానే కామెంట్ పెట్టేసినట్టున్నారు.పూర్తిగా చదివితే నా ఉద్ధేశ్యం ఏమిటో తెలిసేది.మీ ఐడెంటిటీతో కామెంట్ పెడితే సంతోషిస్తాను.

    ReplyDelete
  5. నీహారిక గారు,
    ముందుగా మీ పోరాటానికి అభినందనలు. కానీ ఎందుకు ఇలా పక్కదారుల్లో సీతాదేవిని అడ్డుపెట్టుకుని. మీరు అందరికీ చెప్పాలనుకుంటున్నది ఒకటి, ఇక్కడ కనిపిస్తున్నది మరొకటి. మీరు సీతాదేవి మీద అసభ్యంగా రాస్తున్నారు అని అందరూ అనుకుంటున్నారు తప్పితే ఏ స్త్రీలోనైనా సీతని చూడండి. స్త్రీని స్త్రీగా గౌరవించండి అని మీరు చెప్పాలనుకుంటున్న ఉద్దేశ్యం ఇక్కడ ఎవరికీ చేరడం లేదు. మీరు అనవసరంగా చెడ్డ అవుతున్నారు. ఇప్పటికే మీ బ్లాగును చూసే వీక్షకులు పెరిగారు. ఇప్పుడు మీరు చెప్పాలనుకుంటున్నది సూటిగా చెప్పండి. మూడేళ్ళనుండ తెలుగు బ్లాగులు చూస్తున్నాను. చెత్తగాళ్ళకి భయపడి భాగులు మూసుకున్న ఆడవారే తప్ప, ఇలా ధైర్యంగా ఎదురు నిలబడినవారిని చూడలేదు. అభినందనలు. కానీ మీరు పోరాటానికి ఎంచుకున్న దారి మీమీద అపోహలకే దారితీస్తూంది. ఆలోచించండి. ఇప్పటికైనా మీ ఉద్దేశ్యాలు స్పష్టంగా చెప్పండి. షట్కర్మయుక్తా పోస్ట్ అంత అధ్భుతంగా రాసిన మీరు వెర్రి వెర్రిగా, ఆలోచన లేకుండా ఈ వరుస టపాలు రాస్తున్నారని నేననుకోవడంలేదు. అనవసరంగా నెగటివ్ ఇమేజ్ తెచ్చుకోకండి.

    ReplyDelete
  6. pai agnata,

    image kosam paakuladi agnata ga konni, profile to konni vyakhyalu (uusaravelli rangulla) maarchi vraase vaari to portam chestundi aame ...seeta devi ni aame addupettukunnadaa, leka seeta devi aame ki saayam ga vachchimdaa?


    meeku ardham ayyinatle , meigilina vallandariki ardham avutundi..aameni poradanivvandi

    ReplyDelete