Search This Blog

Saturday, February 12, 2011

ఎల్లోరా గుహలు-భారతీయుల ప్రతిభకు ఒక నిదర్శనం(మరిన్ని ఫోటోలతో)

   మీలో చాలా మంది ఎల్లోరా చూసి ఉంటారు.చూసిన వాళ్ళకి ఈ విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.గత అక్టోబర్ నెలలో షిరిడి సాయి బాబా దర్శనానికి షిరిడి వెళ్ళాము.అప్పుడే ఆ చుట్టుపక్కల ఉన్న దర్శనీయ స్థలాలన్నీ చూడటం జరిగింది.శని శింగణాపుర్,నాసిక్,ఇతర దేవాలయాలతోపాటు ఎల్లోరా గుహలు కూడా చూసాము.అజంతాకి కూడా వెళదామనుకున్నాము కానీ ఆ రోజు అజంతాకు శెలవు రోజు కావటం వల్ల చూడలేకపోయాము.ఎల్లోరా శిల్ప నైపుణ్యం నన్ను ఆశ్చర్య పరిచింది.అది ఒక కొండను పైనుంచి తొలుచుకుంటూ క్రిందికి నిర్మించిన నిర్మాణం. కైలాసమందిరం అద్భుతంగా ఉంటుంది.ఇది కాక చాలా గుహలు ఉంటాయి.దీనిని క్రీ.శ.6 నుంచి 10 శతాబ్ధాల మధ్య, చాళుక్య రాష్ట్రకూట రాజుల  సారధ్యంలో నిర్మించటం జరిగింది.అలాంటిది నిర్మించాలంటే ఈ నాటికీ మనకు అందుబాటులోలేని సాంకేతిక పరిజ్ఞానమేదో వాళ్ళకి అందుబాటులో ఉండి ఉండాలి.నిర్మాణం ప్రారంభించటానికి ముందే ఆ కొండను స్కాన్ చేసి లోపల రాతి స్వభావం,ఆకృతి పరిశీలించి ఉండాలి.లేకపోతే ఆ నిర్మాణం ప్లాన్ గీయటం ఎలా సాధ్యపడుతుంది.

    ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ దాన్ని సంరక్షిస్తోంది.దాని సంరక్షణతో సరిపెట్టుకోకుండా దానివెనుక ఉన్న సాంకేతిక విలువలను కూడా వెలుగులోనికి తీసుకు రావాలి.ఇవేకాకుండా కోణార్క్ సూర్యదేవాలయం, తంజావూర్ బృహదీశ్వరాలయం నిర్మాణాలు కూడా ఇప్పటికీ భారతీయుల సాంకేతిక ప్రతిభకు నిదర్శనమైన అద్భుతాలుగా మిగిలిపోయాయి.నేను తీసిన కొన్నిఫోటోలను కూడా పెడుతున్నాను చూడండి.ఈ సారి ముంబాయి కాని,పూనే కానీ, షిరిడి కానీ వెళితే ఎల్లోరా వెళ్ళండి.అయితే సోమ మంగళ వారాలలో వెళ్ళారంటే అజంతా, ఎల్లోరాలలో ఏదో ఒకటే చూడగలుగుతారు.

Sunday, February 6, 2011

ఎల్లోరా గుహలు-భారతీయుల ప్రతిభకు ఒక నిదర్శనం

పిల్ల కోతి

మా అమ్మాయి పక్షుల ఫోటోలయితే తీయలేక పోయింది కానీ, ఈ కోతి ఫోటో మాత్రం తీసింది.పిల్ల కోతి చాలా ఫన్నీగాఉంది కదూ.

Saturday, February 5, 2011

అల్లోపతి డాక్టర్ గారి ఆయుర్వేదం మందు

   అందుబాటులో ఉన్నవాటిలోఏవైద్యవిధానంమంచిది.అల్లోపతా,ఆయుర్వేదమా,హోమియోపతియా, నేచురోపతియా,  యునానియా.ఏ వైద్యం విధానం విశిష్టత దానిది.అయితే ఈ కాలంలో అల్లోపతి సర్వ జనామోదమైన వైద్యంగా భావించబడుతుంది.అయితే ఇది సమగ్రమైన వైద్యవిధానమేనా?ఈ వైద్యంలో అన్ని వ్యాధులకూ చికిత్స ఉందా అంటే ఖచ్చితం గా లేదు అని చెప్పవచ్చు.మనకు తెలిసినంత వరకు కేన్సర్,ఎయిడ్స్,వైరస్‌ల వల్ల వచ్చే వ్యాధులకు అల్లోపతివైద్యంలో సంపూర్ణచికిత్సలేదు.అంతేకాకుండా కొన్ని వ్యాధులకు ఇచ్చే మందుల వల్ల వ్యాధి నయమయినప్పటికీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా తీవ్రంగా ఉండవచ్చు.మరోపక్క హోమియో వైద్యులు తమ విధానం లో అన్ని వ్యాధులకు చికిత్స ఉందని అంటారు.ఆయుర్వేద వైద్యులు తమ విధానం లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండనే ఉండవని అంటారు.
       ఈ మధ్య మాకుటుంబ సభ్యులలో ఒకరు మూత్రపిండాలలో రాళ్ళ వల్ల నొప్పితో భాధపడుతుంటే అల్లోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. ఆయన ఆ ప్రాంతంలో చాలా మంచి పేరున్న వైద్యులు,చాలా మంచివ్యక్తి.కొన్ని పరీక్షల తర్వాత 2 నుంచి 3 మి.మీ.సైజ్ రాళ్ళున్నాయని నిర్ధారించారు.కొన్ని మందులు వాడితే సరిపోతుందని అన్నారు.ఆ మందులు తీసుకుని ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే అందులో ఒకటి ఆయుర్వేద మందు.మూలికల పొడిని కేప్సూల్స్ లో నింపారు.దానిపేరు డై స్టోన్.నేను చాలా ఆశ్చర్యపోయాను.ఇది ఒక రకంగా శుభ పరిణామమే.ఇంతకు ముందు ఒక డాక్టర్ దగ్గుకు ఏదో ఆయుర్వేద మందు ప్రిస్క్రైబ్ చేసినట్లు గుర్తు.దానిపేరు హనీటస్ అనుకుంటా. ఇప్పటి వరకు నాకు తెలిసినంతవరకు వివిధ వైద్య విధానాలను ప్రాక్టీస్ చేసే డాక్టర్ ల మధ్య పరస్పర అవగాహన కానీ సమన్వయం కానీ లేవు.ఒకరి వైద్యవిధానం లో లోపాలున్నాయని ఒకరంటే అసలు వారి వైద్యం లో శాస్త్రీయతే లేదని మరొకరనేవారు.ఈ విధమైన పరస్పర ఆరోపణలు, అనవసర వాగ్యుధ్ధాల వల్ల ఎవరికీ ఉపయోగం లేదు.అయితే పైన చెప్పిన సంఘటన ఒకరి వైద్యవిధానం లోని విశిష్టతలను మరొకరు గుర్తిస్తున్నారనటానికి ఆస్కారమిస్తుంది.లేకపోతే ఇది మందుల తయారీ సంస్థల గారడీ కూడా కావచ్చు.
అయితే ఈ విషయం లో ప్రభుత్వం కూడా తనవంతు పాత్ర నిర్వహించాలి.ప్రస్తుతం ప్రభుత్వం ఈ వైద్యవిధానాలు అన్నిటినీ దేనికదే ప్రత్యేకం గా గుర్తిస్తుంది.అలాకాకుండా వివిధ వైద్యవిధానాల మధ్య సమన్వయం కోసం సంస్థలను ఏర్పాటు చేయాలి.ఒక వ్యాధికి ఏ వైద్య విధానం లో ఉత్తమమైన చికిత్స ఉందో గుర్తించాలి.అప్పుడు ఆ వ్యాధికి ఏ వైద్య విధానంలోనయినా అదే ఉత్తమ చికిత్స అందే విధంగా చర్యలు తీసుకోవాలి.అప్పుడే అన్ని వైద్య విధానాలలోని మంచిని వినియోగించుకోగలగటానికి అవకాశం ఉంటుంది.
మీకు ఇలాంటి అనుభవాలు ఏవైనా ఎదురై ఉంటే దయచేసి అందరికీ ఉపయోగపడేందుకు ఇక్కడ తెలియచేయ కలరు.

Wednesday, December 15, 2010

ఒక పిట్ట కధ

మీకు ఒక పిట్ట కధ చెప్పాలనుకుంటున్నాను. పిట్ట కధంటే ఏదో చిన్న కధ అనుకున్నారు.నిజంగా పిట్ట కధేనండీ.ఆరు మాసాల క్రితం నాకు ట్రాన్స్‌ఫర్ అయ్యింది.ఎక్కడికి అనుకున్నారు? ఒరిస్సా లోని ఒకానొక పర్యాటక ప్రాంతానికి. ఈ ప్రాంతానికి రకరకాల పిట్టలు/పక్షులు వలస వస్తాయి.నాకు ఎలాట్ చేసిన క్వార్టర్‌కి చుట్టూ చెట్లు ఉన్నాయి,ప్రత్యేకంగా ఎదురుగా ఒక పెద్ద రావి చెట్టు ఉంది.దాని మీదికి అప్పుడప్పుడూ కొన్ని పక్షులు వస్తుంటాయి.అందులో కొన్ని చాలా అందంగా రంగు రంగులలో ఉంటాయి.
మా పెద్ద అమ్మాయికి వాటిని ఏ డిస్కవరీ చానెల్ లేదా నేషనల్ జాగ్రఫీ చానెల్ లెవెల్లో ఫొటోలు తీద్దామని ఆశ. మా ఇంట్లో మంచి కెమెరాయే ఉంది. 14 మెగా పిక్సెల్,3X జూమ్ డిజిటల్ కేమెరా.చాలా సార్లు ప్రయత్నం చేసింది.అయితే ఈ పిట్టలేమయినా మనకు కావల్సినట్టు ఫోజులిస్తాయా ఏంటి.ఆకుల్లో దాక్కుంటాయి.ఈ కొమ్మనుంచి ఆ కొమ్మకి ఎగురుతుంటాయి.ఇంక మనల్ని కానీ గమనించాయా పరారయిపోతాయి.ఒక్క ఫొటో అయినా తిన్నగా రాలేదు. అప్పుడు కానీ అర్ధం కాలేదు,బర్డ్‌వాచర్స్ ఒక్కోఫొటో తియ్యటానికి ఎంతగా కష్టపడతారో,అరుదైన పక్షులఫొటోలు తియ్యటానికైతే ఎన్నిరోజులు ఎదురు చూస్తారో.పక్షులలో ఉన్నన్ని రంగులు మరే ప్రాణులలో లేవేమో? అందమైన పక్షులను చూద్దామనుకుంటున్నారా. ఈ కోల్కతాబర్డ్స్ వెబ్సైట్ కు వెళ్ళండి.భారత దేశంలో 1250 రకాల పక్షి జాతులున్నాయని,ఇవి మొత్తం ప్రపంచ పక్షి జాతులలో దాదాపు 13 శాతం అని తెలిసి ఆశ్చర్యం,ఆనందం కలిగాయి. మీరూ ఆనందించండి. ఈ లోపల మా అమ్మాయి ఏదైనాఫొటో తీస్తే మీకు చూపిస్తాను.

Tuesday, December 14, 2010

సమాచారహక్కు రూల్స్ 2005 కు మార్పులు(సమాచార హక్కుచట్టం)

కేంద్రప్రభుత్వం సమాచార హక్కు రూల్స్‌కు మార్పులు ప్రతిపాదించింది.దీని పై ప్రజలు ఏవైనా వ్యాఖ్యలు చేయతలచుకుంటే, usrti-dopt@nic.in కు 27 డిసెంబరు లోగా ఈ మెయిల్ చేయవచ్చు. ముఖ్యంగా ఈ మార్పులు ఫీసులు,మరియు అప్పీల్ విధానం పైనే ఉన్నాయి.మొత్తం ప్రతిపాదనలు చూడటానికి ఈ క్రింది లింక్‌ను నొక్కండి.
అందరూ ఈ చట్టాన్ని మరింత బలోపేతం చేసే ఆమోదయోగ్యమైన వ్యాఖ్యలు,సూచనలు చేయాలి.అప్పుడే ఈ చట్టం మరింతమందికి చేరువవుతుంది