Search This Blog


Wednesday, December 15, 2010

ఒక పిట్ట కధ


మీకు ఒక పిట్ట కధ చెప్పాలనుకుంటున్నాను. పిట్ట కధంటే ఏదో చిన్న కధ అనుకున్నారు.నిజంగా పిట్ట కధేనండీ.ఆరు మాసాల క్రితం నాకు ట్రాన్స్‌ఫర్ అయ్యింది.ఎక్కడికి అనుకున్నారు? ఒరిస్సా లోని ఒకానొక పర్యాటక ప్రాంతానికి. ఈ ప్రాంతానికి రకరకాల పిట్టలు/పక్షులు వలస వస్తాయి.నాకు ఎలాట్ చేసిన క్వార్టర్‌కి చుట్టూ చెట్లు ఉన్నాయి,ప్రత్యేకంగా ఎదురుగా ఒక పెద్ద రావి చెట్టు ఉంది.దాని మీదికి అప్పుడప్పుడూ కొన్ని పక్షులు వస్తుంటాయి.అందులో కొన్ని చాలా అందంగా రంగు రంగులలో ఉంటాయి.
మా పెద్ద అమ్మాయికి వాటిని ఏ డిస్కవరీ చానెల్ లేదా నేషనల్ జాగ్రఫీ చానెల్ లెవెల్లో ఫొటోలు తీద్దామని ఆశ. మా ఇంట్లో మంచి కెమెరాయే ఉంది. 14 మెగా పిక్సెల్,3X జూమ్ డిజిటల్ కేమెరా.చాలా సార్లు ప్రయత్నం చేసింది.అయితే ఈ పిట్టలేమయినా మనకు కావల్సినట్టు ఫోజులిస్తాయా ఏంటి.ఆకుల్లో దాక్కుంటాయి.ఈ కొమ్మనుంచి ఆ కొమ్మకి ఎగురుతుంటాయి.ఇంక మనల్ని కానీ గమనించాయా పరారయిపోతాయి.ఒక్క ఫొటో అయినా తిన్నగా రాలేదు. అప్పుడు కానీ అర్ధం కాలేదు,బర్డ్‌వాచర్స్ ఒక్కోఫొటో తియ్యటానికి ఎంతగా కష్టపడతారో,అరుదైన పక్షులఫొటోలు తియ్యటానికైతే ఎన్నిరోజులు ఎదురు చూస్తారో.పక్షులలో ఉన్నన్ని రంగులు మరే ప్రాణులలో లేవేమో? అందమైన పక్షులను చూద్దామనుకుంటున్నారా. ఈ కోల్కతాబర్డ్స్ వెబ్సైట్ కు వెళ్ళండి.భారత దేశంలో 1250 రకాల పక్షి జాతులున్నాయని,ఇవి మొత్తం ప్రపంచ పక్షి జాతులలో దాదాపు 13 శాతం అని తెలిసి ఆశ్చర్యం,ఆనందం కలిగాయి. మీరూ ఆనందించండి. ఈ లోపల మా అమ్మాయి ఏదైనాఫొటో తీస్తే మీకు చూపిస్తాను.

Tuesday, December 14, 2010

సమాచారహక్కు రూల్స్ 2005 కు మార్పులు(సమాచార హక్కుచట్టం)

కేంద్రప్రభుత్వం సమాచార హక్కు రూల్స్‌కు మార్పులు ప్రతిపాదించింది.దీని పై ప్రజలు ఏవైనా వ్యాఖ్యలు చేయతలచుకుంటే, usrti-dopt@nic.in కు 27 డిసెంబరు లోగా ఈ మెయిల్ చేయవచ్చు. ముఖ్యంగా ఈ మార్పులు ఫీసులు,మరియు అప్పీల్ విధానం పైనే ఉన్నాయి.మొత్తం ప్రతిపాదనలు చూడటానికి ఈ క్రింది లింక్‌ను నొక్కండి.
అందరూ ఈ చట్టాన్ని మరింత బలోపేతం చేసే ఆమోదయోగ్యమైన వ్యాఖ్యలు,సూచనలు చేయాలి.అప్పుడే ఈ చట్టం మరింతమందికి చేరువవుతుంది

Tuesday, October 5, 2010

క్లిష్టమైన నిర్ణయం

ఈ మధ్య కాలంలో మీరు తీసుకున్న అతి క్లిష్టమైన నిర్ణయమేది?
ఈ మధ్య విడుదలైన రెండు మంచి సినిమాలలో దేనికి వెళ్ళాలనా?
ఓ అందమైన సాయంత్రం డిన్నర్ కి ఏ హోటల్ కి వెళ్ళాలనా?
లేకపోతే అక్కడ మెనూలోని ఏం ఐటం ఆర్డర్ చేయాలనా?
ఏ బ్రాండ్ కారు కొనాలనా?
పోనీ మీ అబ్బాయినో అమ్మాయినో ఏ కాలేజీలో,ఏ బ్రాంచ్ లో చేర్చాలనా?
మీఇద్దరు ముద్దుల అమ్మాయిలు గొడవ పడుతున్నప్పుడు ఎవరిది తప్పో నిర్ణయించడమా?
మీ అమ్మగారు,అందాలభార్య విభేదించినప్పుడు ఎవరి పక్షం వహించాలనా?
మీ ఆత్మీయులు చేసిన తప్పుకు ఎప్పుడైనా సాక్ష్యం చెప్పవలసి వచ్చిందా?ఏం చెప్పారు?
ఓ లంచగొండి అధికారి,విధిలేకో/కక్కుర్తిపడో అతనికి సహకరిస్తున్న కింది ఉద్యోగి ఇద్దరూ CBI అధికారి అయిన మీకు దొరికిపోయారనుకోండి,ఇద్దరినీ ఒకేలా చూస్తారా?
పై సందర్భాలు అన్నీ, లేకపోతే కొన్ని మనకు తటస్థపడే ఉంటాయి.
అయితే వీటిలో ఏ సందర్బంలో మీరు ఎక్కువ సమయం తీసుకున్నారు,అసలు నిర్ణయమే తీసుకోకుండా తప్పించుకున్నారా? తప్పించుకోవడం సాధ్యం కాకపోతే ఏం చేసారు? ఏదయినా నిర్ణయం తీసుకున్న తరవాత తప్పు చేసాననిపించిందా? లేక పోతే మీరు తీసుకున్న నిర్ణయం వల్ల మీరే ఓడిపోయారనిపించిందా?
ఎప్పుడో ఒకప్పుడు అనిపించే ఉంటుంది.
పై వాటిలో కొన్ని కేవలం బుధ్ధి ఉపయోగించి నిర్ణయించవచ్చు,వాటి వల్ల ఏ సమస్యా లేదు. ఆ నిర్ణయం తప్పయినా పెద్దగా పోయేదేమీ లేదు. ఆ కొద్ది నష్టం ఏదో విధంగా భర్తీ చేసుకోవచ్చు.అయితే మరికొన్నిటికి మాత్రం బుధ్ధితో పాటు మనసు ను కూడా ఉపయోగించవలసి వస్తుంది,ఇక్కడే అసలు సమస్య.వీటన్నిటిలో సెంటిమెంట్ కలిసి ఉంటుంది.కరవమంటే కప్పకు కోపం, వదలమంటే పాముకు కోపం బాపతు.మనం తీసుకున్న నిర్ణయం వల్ల ఎవరో ఒకరు నష్టపో వలసి వస్తుంది,ఆ నష్టపోయేవారు కూడా మనకి కావలసిన వాళ్ళయితే ఏం చేయాలి.

ఇంతకీ ఈ సోదంతా ఎందుకంటే నాకు ఈ మధ్య ఇలాంటి సమస్యే ఎదురయ్యింది.ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు మరి.ఇలాంటి సందర్భాలలో మీరైతే ఏం చేస్తారు?ఎవరైనా మంచి సలహా ఇస్తారేమోనని ఆశ.

Saturday, October 2, 2010

ఎవరు నిజమైన హీరో?


గాంధీ అనబడే ఒక బక్కపలచని వ్యక్తి ,ప్రపంచాన్ని తన ఆధీనం లో ఉంచుకున్న బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడ గడ లాడించి తన దారికి తెచ్చుకున్నాడంటే ఎప్పటికీ ఆచ్చర్యం గానే ఉంటుంది. కళ్ళజోడు, చేతికర్ర, కొల్లాయి గుడ్డ ఇదీ ఆయన ఆహార్యం.వేరు సెనగలు,మేకపాలు లాంటి వే ఆయన ఆహారం.సత్యం,శాంతి,సహనం,ప్రేమ ఇవే ఆయన ఆయుధాలు. ఇవే భారతీయ జీవన విధానపు మూల స్థంభాలు.స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన చూపిన తెగువ,విభిన్న వర్గాలను ఏకం చేయటంలో ఆయన చూపిన చాతుర్యం అందరికీ ఆదర్శ ప్రాయం.
హీరో అంటే కండలు తిరిగి ఉండనవసరం లేదు, చిత్రమైన దుస్తులు వేయనవసరం లేదు,విచిత్రమైన విన్యాసాలు చేయనవసరం లేదు. మానసిక ధృడత్వం,ధైర్యం,అందరికీ ఆదర్శప్రాయమైన జీవనశైలి,మచ్చలేని గుణం,ఉన్నతమైన ఆశయాలు ఇవీ నిజమైన హీరోకి ఉండవలసిన లక్షణాలు.ఇవి అన్నీ ఉన్నాయి కాబట్టే ఆయన నిజమైన హీరో.అయితే మనం ప్రస్తుతం ఏంచేస్తున్నాం.హంగు,ఆర్భాటాలు,పాచ్చాత్య జీవన శైలి,మత్తులో మునిగితేలుతున్న ప్రజలు,మద్యం అమ్మకాలమీద వచ్చే ఆదాయం పై ఆధారపడుతున్న ప్రభుత్వాలు.ఇదేనా మనం స్వాతంత్ర్య యోధులకు ఇచ్చే నివాళి.
ఆ మహాత్ముడి పుట్టిన రోజున,మనం పునరాలోచించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.మనం వెళుతున్న దారి సరైనదా కాదా అన్నది మనకే తెలిసిపోతుంది.
విలువలు ఎప్పటికీ శాశ్వతమైనవి.వాటిని ఈ గాంధీ జయంతి సంధర్భం గా గుర్తుకు తెచ్చుకుందాం,ఆచరించటానికి ప్రయత్నిద్దాం.

Monday, September 27, 2010

కోడి ముందా గుడ్డు ముందా?

ఇంకా కోడి ముందా, గుడ్డుముందా....
చెట్టు ముందా,విత్తు ముందా....
అన్న ప్రశ్నలకు సమాధానాలు దొరకనే లేదు.
మనం ఎప్పట్నుంచో వల్లెవేస్తున్న యధారాజా తధా ప్రజా ను కాదని,ABN ఆంధ్రజ్యోతి యధాప్రజా తధారాజా అంటూ రాజు ముందా ప్రజలు ముందా అన్న కొత్త భేతాళ ప్రశ్న మన ముందుకు తెచ్చింది.రాజకీయ నాయకులు అవినీతికి అలవాటు పడిపోయారని,భూస్వాములు,పెట్టుబడి దారులకు కొమ్ముకాస్తూ,ఆశ్రితుల పట్ల ఎనలేని పక్షపాతం ప్రదర్శిస్తున్నారని ప్రజలంటే,అవినీతి అన్ని రంగాలలో ఒక అనివార్యమయిన విషయంగా మారిపోయిందని,కోట్ల రూపాయలు ఖర్చుపెడితేకాని ఎన్నికలలో నెగ్గే పరిస్థితి లేదని కొందరు నాయకులు వాపోతున్నారు.ఇది ఒక విషవలయంగా మారిపోయిందని మాత్రం స్పష్టంగా తేలిపోయింది.
అంతిమంగా నష్టపోయేది సామాన్యుడేనన్నది మరింత స్పష్టం.
మరి దీనికి అంతం ఎక్కడ?
అయితే ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఒకటుంది,ప్రజలంతా విద్యావంతులు,విజ్జతతో అలోచించేవారు,స్వల్పకాలిక ప్రయోజనాల కు,ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటును వినియోగించేవారు అయినప్పుడు రాజకీయ నాయకులు ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా నడవక తప్పదు.నాయకులు దూరదృష్టి కలవారు,సమర్ధులు, నిజాయితీపరులు,అభివృధ్ధికి దోహదమయ్యే చట్టాలు చెయ్యకలిగినవారు అయినప్పుడు ప్రజలే వారిని అనుసరిస్తారు.

నేడు
ప్రజలేమీ అసహాయులు కాదు.సమాచారహక్కు చట్టం,విద్యాహక్కు చట్టం,ఉపాధిహామీ చట్టం లాంటి అద్భుతమైన ఆయుధాలు వీరికి అందుబాటులో ఉన్నాయి. ప్రయోగించటమే మిగిలింది.కనీసం కొంతశాతం ప్రజలు వీటిని అందిపుచ్చుకున్నా ఊహకందని ఫలితాలుంటాయి.అవినీతిని వెలికితీసి బద్దలు చేయటానికి, అమాయకులైన బాలలను,యువతను భాద్యత,నిజాయితీకల పౌరులుగాతీర్చి దిద్దటానికి ఉపయోగపడతాయి.
అంతేకానీ పరస్పర నిందలవల్ల ప్రయోజనం లేదు.
మరి అయుధాలు మీరెప్పుడు చేపడుతున్నారు్?
సిధ్ధమా మరి?

Sunday, September 19, 2010

నవ్వుల పువ్వులు

తెలుగు తక్కువ ఇంగ్లీషు ఎక్కువ వచ్చిన మా చిన్నదాని జోకులివి,
నేనేదో రాస్తుంటే తానేమీ తక్కువ తినలేదని రాయటానికి తయారయ్యింది,ఇవన్నీ తన స్కూలు మాగజైన్ లోనివే
అందాకా ఇంగ్లీషులోనే చదువుకోండి
***************************
Teacher: what is the most commonly used phrase in school?
Johnny: I don’t know
Teacher:Correct
***************************
Johnny: can I go to the toilet?
English teacher: no, Johnny May I go to the toilet?
Johnny: but, I asked first
***************************
Naresh: why are you drawing on the walls and spoiling them?
Gopi: uncle! You said it is a drawing room, didn’t you?
***************************
Venu: daddy, How much I am worth?
Daddy: Why son, you worth a million to me
Venu: Then please advance me 10% of it
***************************
Son : daddy some one has come for a donation for a swimming pool
Father: Give him a bucket of water
***************************
Ramesh : Why do surgeons and nurses wear masks during an operation?
Ram: So that, if they make a mistake, no one will know who did it
***************************


Wednesday, September 15, 2010

డబ్బుంటే చాలా?

డబ్బుతో పుస్తకాలు కొనగలం కానీ
జ్ఞానాన్నికొనలేం
డబ్బుతో పరుపును కొనగలం కానీ
నిద్రను కొనలేం
డబ్బుతో గడియారం కొనగలం కానీ
కాలాన్ని కొనలేం
డబ్బుతో పదవిని కొనగలం కానీ
గౌరవాన్ని కొనలేం
డబ్బుతో వైద్యాన్ని కొనగలం కానీ
ఆరోగ్యాన్ని కొనలేం
మరి డబ్బుంటే చాలా?

నవ్వుల పువ్వులు

టీచర్:రవీ నువ్వు ఏ ఊరిలో పుట్టావు
రవి:అహ్మదాబాదులో టీచర్
టీచర్:అయితే అహ్మదాబాదు స్పెల్లింగ్ చెప్పు
రవి:స్పెల్లింగ్ చెప్పాలంటే గోవాలో పుట్టేను టీచర్

భారత రాజ్యాంగం గురించి తెలుసుకోండి

భారత రాజ్యాంగం మనకు ప్రాధమిక హక్కులు ప్రసాదించిందని,ప్రాధమిక హక్కులు భారత రాజ్యాంగానికి మూల స్తంభాల లాంటివని మీ అందరికీ తెలుసు.అయితే అవి ఏ విధంగా సమర్ధంగా అమలు చేయబడతాయి?
కంచే చేనుమేసినట్లు ప్రభుత్వం,ప్రభుత్వ అధికారులే ప్రాధమిక హక్కులు ఉల్లంఘిస్తే ఏం చేయాలి?
ఇలాంటి సందర్భాలలో పౌరులు ఆర్టి‌‍కల్ 32 లేదా ఆర్టి‌‍కల్ 226 క్రింద సుప్రీంకోర్టు లేదా హైకోర్టును ఆశ్రయించవచ్చు. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు ఈ క్రింది రిట్లను జారీ చేయటం ద్వారా ప్రాధమిక హక్కులను కాపాడతాయి.
వీటినే రాజ్యాంగ తరుణోపాయాలు అంటారు.
  1. హెబియస్ కార్పస్: ఏ వ్యక్తి నయినా అక్రమంగా బంధించినప్పుడు,సంబంధిత అధికారి/వ్యక్తి కి స్వాధీనంలోని వ్యక్తిని తెచ్చి చూపి,కారణం తెలియపరచవలసిందిగా ఇచ్చే ఆజ్ఞ.
  2. మాండమస్: ఏదైనా రాజ్యంగ లేదా శాసన విధిని నిర్వర్తించమని కానీ, అమలుచేయరాదని కానీ భాద్యులైన ప్రభుత్వ అధికారులకు,క్రిందికోర్టులకు ఇచ్చే ఆజ్ఞ.
  3. ప్రొహిబిషన్: ఇది క్రిందికోర్టులు తమ పరిధి మీరినప్పుడు, తీర్పు వెలువరించకుండా నిషేధిస్తూ ఇచ్చే ఆజ్ఞ.
  4. సెర్షియరరీ: ఇది క్రిందికోర్టులు తమ పరిధి మీరి ఇచ్చిన తీర్పులను రద్దు చేస్తూ ఇచ్చే ఆజ్ఞ.
  5. కో వారంటో:ఎవరైనా వ్యక్తికి పబ్లిక్ పదవి పొందుటలో గల శాసనబద్దతను ప్రశ్నిస్తూ ఇచ్చే ఆజ్ఞ.
అందుకే 32 ఆర్టికల్ ను రాజ్యాంగానికి ఆత్మ/హృదయం అంటారు.