మా అమ్మాయి పక్షుల ఫోటోలయితే తీయలేక పోయింది కానీ, ఈ కోతి ఫోటో మాత్రం తీసింది.పిల్ల కోతి చాలా ఫన్నీగాఉంది కదూ.
Search This Blog
Sunday, February 6, 2011
Saturday, February 5, 2011
అల్లోపతి డాక్టర్ గారి ఆయుర్వేదం మందు
అందుబాటులో ఉన్నవాటిలోఏవైద్యవిధానంమంచిది.అల్లోపతా,ఆయుర్వేదమా,హోమియోపతియా, నేచురోపతియా, యునానియా.ఏ వైద్యం విధానం విశిష్టత దానిది.అయితే ఈ కాలంలో అల్లోపతి సర్వ జనామోదమైన వైద్యంగా భావించబడుతుంది.అయితే ఇది సమగ్రమైన వైద్యవిధానమేనా?ఈ వైద్యంలో అన్ని వ్యాధులకూ చికిత్స ఉందా అంటే ఖచ్చితం గా లేదు అని చెప్పవచ్చు.మనకు తెలిసినంత వరకు కేన్సర్,ఎయిడ్స్,వైరస్‌ల వల్ల వచ్చే వ్యాధులకు అల్లోపతివైద్యంలో సంపూర్ణచికిత్సలేదు.అంతేకాకుండా కొన్ని వ్యాధులకు ఇచ్చే మందుల వల్ల వ్యాధి నయమయినప్పటికీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా తీవ్రంగా ఉండవచ్చు.మరోపక్క హోమియో వైద్యులు తమ విధానం లో అన్ని వ్యాధులకు చికిత్స ఉందని అంటారు.ఆయుర్వేద వైద్యులు తమ విధానం లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండనే ఉండవని అంటారు.
ఈ మధ్య మాకుటుంబ సభ్యులలో ఒకరు మూత్రపిండాలలో రాళ్ళ వల్ల నొప్పితో భాధపడుతుంటే అల్లోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. ఆయన ఆ ప్రాంతంలో చాలా మంచి పేరున్న వైద్యులు,చాలా మంచివ్యక్తి.కొన్ని పరీక్షల తర్వాత 2 నుంచి 3 మి.మీ.సైజ్ రాళ్ళున్నాయని నిర్ధారించారు.కొన్ని మందులు వాడితే సరిపోతుందని అన్నారు.ఆ మందులు తీసుకుని ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే అందులో ఒకటి ఆయుర్వేద మందు.మూలికల పొడిని కేప్సూల్స్ లో నింపారు.దానిపేరు డై స్టోన్.నేను చాలా ఆశ్చర్యపోయాను.ఇది ఒక రకంగా శుభ పరిణామమే.ఇంతకు ముందు ఒక డాక్టర్ దగ్గుకు ఏదో ఆయుర్వేద మందు ప్రిస్క్రైబ్ చేసినట్లు గుర్తు.దానిపేరు హనీటస్ అనుకుంటా. ఇప్పటి వరకు నాకు తెలిసినంతవరకు వివిధ వైద్య విధానాలను ప్రాక్టీస్ చేసే డాక్టర్ ల మధ్య పరస్పర అవగాహన కానీ సమన్వయం కానీ లేవు.ఒకరి వైద్యవిధానం లో లోపాలున్నాయని ఒకరంటే అసలు వారి వైద్యం లో శాస్త్రీయతే లేదని మరొకరనేవారు.ఈ విధమైన పరస్పర ఆరోపణలు, అనవసర వాగ్యుధ్ధాల వల్ల ఎవరికీ ఉపయోగం లేదు.అయితే పైన చెప్పిన సంఘటన ఒకరి వైద్యవిధానం లోని విశిష్టతలను మరొకరు గుర్తిస్తున్నారనటానికి ఆస్కారమిస్తుంది.లేకపోతే ఇది మందుల తయారీ సంస్థల గారడీ కూడా కావచ్చు.
అయితే ఈ విషయం లో ప్రభుత్వం కూడా తనవంతు పాత్ర నిర్వహించాలి.ప్రస్తుతం ప్రభుత్వం ఈ వైద్యవిధానాలు అన్నిటినీ దేనికదే ప్రత్యేకం గా గుర్తిస్తుంది.అలాకాకుండా వివిధ వైద్యవిధానాల మధ్య సమన్వయం కోసం సంస్థలను ఏర్పాటు చేయాలి.ఒక వ్యాధికి ఏ వైద్య విధానం లో ఉత్తమమైన చికిత్స ఉందో గుర్తించాలి.అప్పుడు ఆ వ్యాధికి ఏ వైద్య విధానంలోనయినా అదే ఉత్తమ చికిత్స అందే విధంగా చర్యలు తీసుకోవాలి.అప్పుడే అన్ని వైద్య విధానాలలోని మంచిని వినియోగించుకోగలగటానికి అవకాశం ఉంటుంది.
మీకు ఇలాంటి అనుభవాలు ఏవైనా ఎదురై ఉంటే దయచేసి అందరికీ ఉపయోగపడేందుకు ఇక్కడ తెలియచేయ కలరు.
Wednesday, December 15, 2010
ఒక పిట్ట కధ

మీకు ఒక పిట్ట కధ చెప్పాలనుకుంటున్నాను. పిట్ట కధంటే ఏదో చిన్న కధ అనుకున్నారు.నిజంగా పిట్ట కధేనండీ.ఆరు మాసాల క్రితం నాకు ట్రాన్స్‌ఫర్ అయ్యింది.ఎక్కడికి అనుకున్నారు? ఒరిస్సా లోని ఒకానొక పర్యాటక ప్రాంతానికి. ఈ ప్రాంతానికి రకరకాల పిట్టలు/పక్షులు వలస వస్తాయి.నాకు ఎలాట్ చేసిన క్వార్టర్‌కి చుట్టూ చెట్లు ఉన్నాయి,ప్రత్యేకంగా ఎదురుగా ఒక పెద్ద రావి చెట్టు ఉంది.దాని మీదికి అప్పుడప్పుడూ కొన్ని పక్షులు వస్తుంటాయి.అందులో కొన్ని చాలా అందంగా రంగు రంగులలో ఉంటాయి.
మా పెద్ద అమ్మాయికి వాటిని ఏ డిస్కవరీ చానెల్ లేదా నేషనల్ జాగ్రఫీ చానెల్ లెవెల్లో ఫొటోలు తీద్దామని ఆశ. మా ఇంట్లో మంచి కెమెరాయే ఉంది. 14 మెగా పిక్సెల్,3X జూమ్ డిజిటల్ కేమెరా.చాలా సార్లు ప్రయత్నం చేసింది.అయితే ఈ పిట్టలేమయినా మనకు కావల్సినట్టు ఫోజులిస్తాయా ఏంటి.ఆకుల్లో దాక్కుంటాయి.ఈ కొమ్మనుంచి ఆ కొమ్మకి ఎగురుతుంటాయి.ఇంక మనల్ని కానీ గమనించాయా పరారయిపోతాయి.ఒక్క ఫొటో అయినా తిన్నగా రాలేదు. అప్పుడు కానీ అర్ధం కాలేదు,బర్డ్‌వాచర్స్ ఒక్కోఫొటో తియ్యటానికి ఎంతగా కష్టపడతారో,అరుదైన పక్షులఫొటోలు తియ్యటానికైతే ఎన్నిరోజులు ఎదురు చూస్తారో.పక్షులలో ఉన్నన్ని రంగులు మరే ప్రాణులలో లేవేమో? అందమైన పక్షులను చూద్దామనుకుంటున్నారా. ఈ కోల్కతాబర్డ్స్ వెబ్సైట్ కు వెళ్ళండి.భారత దేశంలో 1250 రకాల పక్షి జాతులున్నాయని,ఇవి మొత్తం ప్రపంచ పక్షి జాతులలో దాదాపు 13 శాతం అని తెలిసి ఆశ్చర్యం,ఆనందం కలిగాయి. మీరూ ఆనందించండి. ఈ లోపల మా అమ్మాయి ఏదైనాఫొటో తీస్తే మీకు చూపిస్తాను.
Tuesday, December 14, 2010
సమాచారహక్కు రూల్స్ 2005 కు మార్పులు(సమాచార హక్కుచట్టం)
కేంద్రప్రభుత్వం సమాచార హక్కు రూల్స్‌కు మార్పులు ప్రతిపాదించింది.దీని పై ప్రజలు ఏవైనా వ్యాఖ్యలు చేయతలచుకుంటే, usrti-dopt@nic.in కు 27 డిసెంబరు లోగా ఈ మెయిల్ చేయవచ్చు. ముఖ్యంగా ఈ మార్పులు ఫీసులు,మరియు అప్పీల్ విధానం పైనే ఉన్నాయి.మొత్తం ప్రతిపాదనలు చూడటానికి ఈ క్రింది లింక్‌ను నొక్కండి.
అందరూ ఈ చట్టాన్ని మరింత బలోపేతం చేసే ఆమోదయోగ్యమైన వ్యాఖ్యలు,సూచనలు చేయాలి.అప్పుడే ఈ చట్టం మరింతమందికి చేరువవుతుంది
Tuesday, October 5, 2010
క్లిష్టమైన నిర్ణయం
ఈ మధ్య కాలంలో మీరు తీసుకున్న అతి క్లిష్టమైన నిర్ణయమేది?
ఈ మధ్య విడుదలైన రెండు మంచి సినిమాలలో దేనికి వెళ్ళాలనా?
ఓ అందమైన సాయంత్రం డిన్నర్ కి ఏ హోటల్ కి వెళ్ళాలనా?
లేకపోతే అక్కడ మెనూలోని ఏం ఐటం ఆర్డర్ చేయాలనా?
ఏ బ్రాండ్ కారు కొనాలనా?
పోనీ మీ అబ్బాయినో అమ్మాయినో ఏ కాలేజీలో,ఏ బ్రాంచ్ లో చేర్చాలనా?
మీఇద్దరు ముద్దుల అమ్మాయిలు గొడవ పడుతున్నప్పుడు ఎవరిది తప్పో నిర్ణయించడమా?
మీ అమ్మగారు,అందాలభార్య విభేదించినప్పుడు ఎవరి పక్షం వహించాలనా?
మీ ఆత్మీయులు చేసిన తప్పుకు ఎప్పుడైనా సాక్ష్యం చెప్పవలసి వచ్చిందా?ఏం చెప్పారు?
ఈ మధ్య విడుదలైన రెండు మంచి సినిమాలలో దేనికి వెళ్ళాలనా?
ఓ అందమైన సాయంత్రం డిన్నర్ కి ఏ హోటల్ కి వెళ్ళాలనా?
లేకపోతే అక్కడ మెనూలోని ఏం ఐటం ఆర్డర్ చేయాలనా?
ఏ బ్రాండ్ కారు కొనాలనా?
పోనీ మీ అబ్బాయినో అమ్మాయినో ఏ కాలేజీలో,ఏ బ్రాంచ్ లో చేర్చాలనా?
మీఇద్దరు ముద్దుల అమ్మాయిలు గొడవ పడుతున్నప్పుడు ఎవరిది తప్పో నిర్ణయించడమా?
మీ అమ్మగారు,అందాలభార్య విభేదించినప్పుడు ఎవరి పక్షం వహించాలనా?
మీ ఆత్మీయులు చేసిన తప్పుకు ఎప్పుడైనా సాక్ష్యం చెప్పవలసి వచ్చిందా?ఏం చెప్పారు?
ఓ లంచగొండి అధికారి,విధిలేకో/కక్కుర్తిపడో అతనికి సహకరిస్తున్న కింది ఉద్యోగి ఇద్దరూ CBI అధికారి అయిన మీకు దొరికిపోయారనుకోండి,ఇద్దరినీ ఒకేలా చూస్తారా?
పై సందర్భాలు అన్నీ, లేకపోతే కొన్ని మనకు తటస్థపడే ఉంటాయి.అయితే వీటిలో ఏ సందర్బంలో మీరు ఎక్కువ సమయం తీసుకున్నారు,అసలు నిర్ణయమే తీసుకోకుండా తప్పించుకున్నారా? తప్పించుకోవడం సాధ్యం కాకపోతే ఏం చేసారు? ఏదయినా నిర్ణయం తీసుకున్న తరవాత తప్పు చేసాననిపించిందా? లేక పోతే మీరు తీసుకున్న నిర్ణయం వల్ల మీరే ఓడిపోయారనిపించిందా?
ఎప్పుడో ఒకప్పుడు అనిపించే ఉంటుంది.పై వాటిలో కొన్ని కేవలం బుధ్ధి ఉపయోగించి నిర్ణయించవచ్చు,వాటి వల్ల ఏ సమస్యా లేదు. ఆ నిర్ణయం తప్పయినా పెద్దగా పోయేదేమీ లేదు. ఆ కొద్ది నష్టం ఏదో విధంగా భర్తీ చేసుకోవచ్చు.అయితే మరికొన్నిటికి మాత్రం బుధ్ధితో పాటు మనసు ను కూడా ఉపయోగించవలసి వస్తుంది,ఇక్కడే అసలు సమస్య.వీటన్నిటిలో సెంటిమెంట్ కలిసి ఉంటుంది.కరవమంటే కప్పకు కోపం, వదలమంటే పాముకు కోపం బాపతు.మనం తీసుకున్న నిర్ణయం వల్ల ఎవరో ఒకరు నష్టపో వలసి వస్తుంది,ఆ నష్టపోయేవారు కూడా మనకి కావలసిన వాళ్ళయితే ఏం చేయాలి.
ఇంతకీ ఈ సోదంతా ఎందుకంటే నాకు ఈ మధ్య ఇలాంటి సమస్యే ఎదురయ్యింది.ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు మరి.ఇలాంటి సందర్భాలలో మీరైతే ఏం చేస్తారు?ఎవరైనా మంచి సలహా ఇస్తారేమోనని ఆశ.
Saturday, October 2, 2010
ఎవరు నిజమైన హీరో?

గాంధీ అనబడే ఒక బక్కపలచని వ్యక్తి ,ప్రపంచాన్ని తన ఆధీనం లో ఉంచుకున్న బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడ గడ లాడించి తన దారికి తెచ్చుకున్నాడంటే ఎప్పటికీ ఆచ్చర్యం గానే ఉంటుంది. కళ్ళజోడు, చేతికర్ర, కొల్లాయి గుడ్డ ఇదీ ఆయన ఆహార్యం.వేరు సెనగలు,మేకపాలు లాంటి వే ఆయన ఆహారం.సత్యం,శాంతి,సహనం,ప్రేమ ఇవే ఆయన ఆయుధాలు. ఇవే భారతీయ జీవన విధానపు మూల స్థంభాలు.స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన చూపిన తెగువ,విభిన్న వర్గాలను ఏకం చేయటంలో ఆయన చూపిన చాతుర్యం అందరికీ ఆదర్శ ప్రాయం.
హీరో అంటే కండలు తిరిగి ఉండనవసరం లేదు, చిత్రమైన దుస్తులు వేయనవసరం లేదు,విచిత్రమైన విన్యాసాలు చేయనవసరం లేదు. మానసిక ధృడత్వం,ధైర్యం,అందరికీ ఆదర్శప్రాయమైన జీవనశైలి,మచ్చలేని గుణం,ఉన్నతమైన ఆశయాలు ఇవీ నిజమైన హీరోకి ఉండవలసిన లక్షణాలు.ఇవి అన్నీ ఉన్నాయి కాబట్టే ఆయన నిజమైన హీరో.అయితే మనం ప్రస్తుతం ఏంచేస్తున్నాం.హంగు,ఆర్భాటాలు,పాచ్చాత్య జీవన శైలి,మత్తులో మునిగితేలుతున్న ప్రజలు,మద్యం అమ్మకాలమీద వచ్చే ఆదాయం పై ఆధారపడుతున్న ప్రభుత్వాలు.ఇదేనా మనం స్వాతంత్ర్య యోధులకు ఇచ్చే నివాళి.
ఆ మహాత్ముడి పుట్టిన రోజున,మనం పునరాలోచించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.మనం వెళుతున్న దారి సరైనదా కాదా అన్నది మనకే తెలిసిపోతుంది.
ఆ మహాత్ముడి పుట్టిన రోజున,మనం పునరాలోచించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.మనం వెళుతున్న దారి సరైనదా కాదా అన్నది మనకే తెలిసిపోతుంది.
విలువలు ఎప్పటికీ శాశ్వతమైనవి.వాటిని ఈ గాంధీ జయంతి సంధర్భం గా గుర్తుకు తెచ్చుకుందాం,ఆచరించటానికి ప్రయత్నిద్దాం.
Subscribe to:
Posts (Atom)
